వరంగల్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

వరంగల్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

జనగామ అర్బన్/ కాశీబుగ్గ (కార్పొరేషన్)​/ పర్వతగిరి (గీసుగొండ), వెలుగు : ప్రజాస్వామ్య విలువలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు మాక్​పార్లమెంట్​ దోహదపడుతుందని జనగామ, వరంగల్​ కలెక్టర్లు సందీప్​కుమార్​ఝా, సత్యశారద అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి వారోత్సవాల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో మాక్​పార్లమెంట్​ కార్యక్రమాన్ని నిర్వహించగా, గీసుగొండ మండలంలోని ఆయా గ్రామాల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి మహిళా సమాక్య భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 

మాక్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులు బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలికల భద్రత, విద్యా సౌకర్యాలు, ఆరోగ్య సేవలు, పోషకాహారం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై చర్చించారు. బాలికల భద్రతకు సంబంధించి పోక్సో చట్టం, సైబర్ నేరాల నివారణ, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, మహిళా హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ 1098 వంటి అంశాలపై మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.