Akhil Wife Zainab: ‘లెనిన్’ దుమ్మురేపే వసూళ్లు.. భర్త అఖిల్ సక్సెస్‌పై జైనబ్ ఎమోషనల్ పోస్ట్

Akhil Wife Zainab: ‘లెనిన్’ దుమ్మురేపే వసూళ్లు.. భర్త అఖిల్ సక్సెస్‌పై జైనబ్ ఎమోషనల్ పోస్ట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ భార్య జైనాబ్ రవ్జీ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన జైనాబ్..‘లెనిన్’ చిత్రాన్ని ఇంతటి భారీ బ్లాక్‌బస్టర్ చేసినందుకు, అఖిల్‌పై చూపిస్తున్న అపారమైన ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రేక్షకులు చూపిస్తున్న ఈ ఆదరణ చూసి తాము ఎంతో ఉద్వేగానికి లోనయ్యామని, ఎప్పటికీ రుణపడి ఉంటామని జైనాబ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ వెంటనే జైనాబ్ పోస్ట్కు అఖిల్ స్పందిస్తూ..‘థ్యాంక్యూ మై లైఫ్’ అని ప్రేమతో రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం జైనాబ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇటీవల ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్‌లోనూ ‘అయ్యగారు నంబర్ వన్’ అంటూ జైనబ్ చేసిన సందడి అభిమానులను ఆకట్టుకుంది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అఖిల్‌కు సాలిడ్ హిట్ పడటంతో.. జైనాబ్ లేడీ లక్ అని అక్కినేని ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.

‘లెనిన్’ 8 రోజుల బాక్సాఫీస్:

‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ప్రారంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో భారీ వసూళ్లు సాధిస్తూ అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబడుతున్న చిత్రంగా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.52 కోట్ల నెట్ వసూలు చేసింది.

రూ.24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి రూ.5 కోట్లకు పైగా లాభాలు అందించినట్లు తెలుస్తోంది. ఫుల్ రన్‌లో రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే, ఈ చిత్రం 6 రోజుల్లో 78 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసినట్లుగా అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.