వంట చేయాలా.. బాత్రూమ్‌లు కడగాలా?..మోడల్ స్కూళ్ల వంట సిబ్బంది ఆందోళన 

వంట చేయాలా.. బాత్రూమ్‌లు కడగాలా?..మోడల్ స్కూళ్ల వంట సిబ్బంది ఆందోళన 

హైదరాబాద్, వెలుగు: ‘‘వంట చేసే చేతులతోనే బాత్రూమ్‌లు కడిగిస్తున్నరు.. అన్నం పెట్టే వాళ్లతోనే అనాగరిక పనులు చేయిస్తున్నరు.. పిల్లలకు మంచి ఆహారం అందించాలా.. లేక మరుగు దొడ్లు కడగాలా?’’అంటూ మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో స్కావెంజర్లను తొలగించి, ఆ పనిని తమ మీద రుద్దడాన్ని నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు.

అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంట కార్మికులు మాట్లాడుతూ.. వంట చేసే తాము.. బాత్రూమ్‌లు​కడిగితే పిల్లలు అన్నం తినేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే స్కావెంజర్లను, అదనంగా మరో ఇద్దరు స్వీపర్లను నియమించాలని డిమాండ్ చేశారు.