ఇతర దేశాలకు పంపడం వల్లే మనకు టీకా కొరత 

V6 Velugu Posted on Apr 10, 2021

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విమర్శించారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎక్కువ టీకాలను పంపడంతో స్వదేశంలో వాటి కొరత ఏర్పడిందన్నారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్ ను గిఫ్ట్ గా పంపిణీ చేస్తూ, ఇక్కడ కొరత ఉంటే అలసత్వం చూపడం సరికాదన్నారు. ఈ విషయంలో కేంద్రమే మీదే అందరూ ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కరోనా టీకాల లభ్యత అంశంపై సోనియా పైవిధంగా స్పందించారు. టెస్ట్, ట్రాక్, వ్యాక్సినేట్ ప్రాతిపదికన ముందుకెళ్లాలని సీఎంలకు ఆమె దిశా నిర్దేశనం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేదా ఏ స్టేట్ అయినా కరోనా కేసుల పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. 
 

Tagged government, pm modi, Vaccination, Rahul Gandhi, Central, Corona situation

Latest Videos

Subscribe Now

More News