2047 వరకు మోదీయే ప్రధాని..భారత్‌‌‌‌ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడం ఖాయం

2047 వరకు మోదీయే ప్రధాని..భారత్‌‌‌‌ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడం ఖాయం
  • మీనాక్షి నటరాజన్‌‌‌‌ వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోనిది.. : కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌

కరీంనగర్, వెలుగు : నరేంద్రమోదీ 2047 వరకు ప్రధానిగా కొనసాగుతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ అన్నారు. భారత్‌‌‌‌ను విశ్వగురు స్థానంలో నిలబెట్టే వరకు మోదీ విశ్రమించబోరన్నారు. ప్రధానిగా 4,398 రోజులు పూర్తి చేసుకుని జవహర్‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూ రికార్డును మోదీ తిరగరాశారన్నారు. కరీంనగర్‌‌‌‌లోని శ్రీమహాశక్తి ఆలయంలో బుధవారం స్థానిక నాయకులతో కలిసి బండి సంజయ్‌‌‌‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రూ పాలనలో అవినీతి, అరాచకాలు, బంధుప్రీతి కొనసాగిందని విమర్శించారు. కానీ మోదీ పాలన అందుకు భిన్నంగా నిజాయితీ, నిబద్ధతతో కొనసాగుతోందన్నారు.

 మోదీ 12 ఏండ్ల పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేశారని చెప్పారు. రోడ్లు, రైల్వే, ఎయిర్, టెలి కమ్యూనికేషన్ రంగాల్లో అనూహ్యమైన ప్రగతి సాధించారని, అవినీతికి తావులేకుండా సమాజంలో అట్టడుగునున్న వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. మీనాక్షి నటరాజన్‌‌‌‌ రాజ్యసభ నామినేషన్‌‌‌‌ తిరస్కరణ ఎన్నికల కమిషన్‌‌‌‌ పరిధిలోని అంశమని అభిప్రాయపడ్డారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్‌‌‌‌ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌‌‌‌ సునీల్‌‌‌‌రావు పాల్గొన్నారు.