వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యం

వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యం

ఢిల్లీ : కరోనా కట్టడికి రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. టెస్టింగ్ తో పాటు ట్రేసింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రం తరఫున మంత్రి హరీష్ రావుతో పాటు వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలన్న ప్రధాని.. లోకల్ కంటైన్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న ఆయన.. దేశంలో 10 రోజుల్లోనే 3కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితిని వైద్య నిపుణులు నిరంతరం సమీక్షిస్తున్నారన్న ప్రధాని.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని మోడీ అభిప్రాయపడ్డారు.