
దేశంలోనే కాదు.. దక్షిణ ఆసియాలోనే తొలి ‘వాటర్ మెట్రో’ కేరళ వాసులకు సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. కొచిలో ఏర్పాటు చేసిన వాటర్ మెట్రో సర్వీసులో భాగంగా.. సిటీ చుట్టుపక్కల ఉన్న 10 ద్వీపాలను కలుపుతూ 78 హైబ్రిడ్ బోట్లు తిరగనున్నాయి.
కేరళ ప్రభుత్వం ఈ మెట్రో సర్వీసు ప్రాజెక్టును సుమారు రూ.1137 కోట్లు వెచ్చించి జర్మనీ ప్రభుత్వ సహకారంతో నిర్మించింది. పర్యావరణానికి హాని కలగకుండా ఈ బోట్లను విద్యుత్ తో నడిచేలా రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు.