శివుడు ఆకారంలో క్రికెట్ స్టేడియం.. కాశీలో రూపుదిద్దుకుంటున్న అద్భుతం

శివుడు ఆకారంలో క్రికెట్ స్టేడియం.. కాశీలో రూపుదిద్దుకుంటున్న అద్భుతం

కాశీ అనగానే మహాదేవుడు శివుడు కొలువైన క్షేత్రంగా గుర్తుకొస్తుంది.. కాశీ అనగానే పుణ్య క్షేత్రంగా భావిస్తాం.. ఇప్పుడు అదే కాశీలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నది. దీని కోసం ఇప్పటికే అంతా సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం...

అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు జరిగే విధంగా.. శివుడు ఆకారంలో కాశీలో క్రికెట్ స్టేడియం నిర్మించటానికి సెప్టెంబర్ 23వ తేదీ ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ స్టేడియం నిర్మాణానికి 350 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. 30 వేల ప్రేక్షకులు కూర్చునే విధంగా డిజైన్ చేసినట్లు సమాచారం. మొత్తం 31 ఎకరాల విస్తీర్ణంలో.. ఏడు పిచ్ లు తయారు చేస్తున్నారంట. 

ఇక శివుడు ఆకారంలో క్రికెట్ స్టేడియం ఎలా నిర్మిస్తారు అనే డౌట్ రావొచ్చు.. అక్కడికి వస్తున్నాం. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే సీటింగ్ మొత్తాన్ని అర్థం చంద్రాకారంలో నిర్మిస్తున్నారు. స్టేడియం లైట్లను శివుడు త్రిశూలం ఆకారంలో నిర్మిస్తున్నారు. స్టేడియం ఎంట్రీని ఢమరుకం ఆకారంలో నిర్మిస్తున్నారు. 

వారణాసి నుంచి ప్రధాని మోదీ.. ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ వేడుకకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. క్రికెట్ స్టేడియం శంకుస్థాపనకు మాజీ క్రికెట్ దిగ్గజాలు హాజరవుతున్నట్లు సమాచారం.