
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జులై 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాలో పర్య టించనున్నారు. రష్యాలో పర్యటించాలని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీని ఇదివరకే కోరారు. 22వ భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల 8–9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు. ఆ తర్వా త ఆస్ట్రియాకు వెళ్తారు. ఆ దేశంలో 9-10 తేదీల్లో పర్యటించి పలు సమావేశాల్లో పాల్గొంటారు.
ఈ మేరకు గురువారం విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘41 ఏండ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆస్ట్రి యా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లె న్, ఛాన్స్ లర్ కార్ల్ నెహమర్ తో చర్చలు జరపుతారు” అని పేర్కొంది.