
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో పర్యటించనున్నారు. రూ.5,100 కోట్లకుగాపైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. త్రిపురలో పునరుద్ధరించిన మాతా త్రిపుర సుందరి ఆలయ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారని, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ. 3,700 కోట్లతో నిర్మించనున్న రెండు మేజర్ హైడ్రోపవర్ప్రాజెక్ట్స్తోపాటు తవాంగ్‌లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారని పీఓంవో కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
వీటితో పాటు రూ.1,290 కోట్లకు పైగా విలువైన బహుళ కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని సియోమ్ సబ్‌బేసిన్‌లో హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (240 మెగావాట్లు), టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.