మోదీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తం : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

మోదీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తం :  బీజేపీ ఎంపీ లక్ష్మణ్
  • వీడియో ప్రచార వెహికిల్స్ ప్రారంభించిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు :  గత 9 ఏళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.  సోమవారం నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో బీజేపీ వీడియో ప్రచార వెహికిల్స్ ను పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డితో కలిసి ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసేందుకు డబ్బు, మద్యం పంచాల్సిన అవసరం బీజేపీకి లేదని లక్ష్మణ్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి ద్రోహం చేస్తుందని, ఆ పార్టీని నమ్మొద్దని ఆయన కోరారు. దళితుడిని సీఎంను చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి ఆయనే సీఎం అయ్యారని, బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిందని, ఆ హామీని కచ్చితంగా అమలు చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.