V6 News

‘బసవన్న’ చూపిన బాటలో మోదీ పాలన : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు 

‘బసవన్న’ చూపిన బాటలో మోదీ పాలన : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు 

హైదరాబాద్, వెలుగు: సామాజిక విప్లవకారుడు, తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుడు చూపిన బాటలోనే ప్రధాని మోదీ పాలన సాగుతోందని బీజేపీ స్టేట్​ చీఫ్​ఎన్.రాంచందర్ రావు అన్నారు. కులరహిత, సమానత్వ సమాజ నిర్మాణమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వరుడు కేవలం ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితం కాదని, ఆయన ఒక మహోన్నత సిద్ధాంతమని కొనియాడారు. బసవన్న ఆలోచనా విధానం నుంచే మోదీ స్ఫూర్తి పొందారని చెప్పారు. అందుకే మన దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ నేతలు పాల్గొన్నారు