మోడీ తమ్ముడి కూతురు హ్యాండ్ బ్యాగ్ దొరికింది

మోడీ తమ్ముడి కూతురు హ్యాండ్ బ్యాగ్ దొరికింది

 హర్యానాలో నిందితుడి అరెస్టు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ కూతురు దమయంతి బెన్  హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం హర్యానాలోని సోనేపట్​లో నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. శనివారం ఉదయం 7 గంటల సమయంలో నార్త్ ఢిల్లీలోని సివిల్ లైన్ ఏరియాలో  ఆటో దిగుతుండగా ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పై వచ్చి హ్యాండ్ బ్యాగ్ లాక్కెళ్లారని దమయంతి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హ్యాండ్ బ్యాగ్ లో రూ.56 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్స్, డాక్యుమెంట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు.