దిస్పూర్: అస్సాంలోని జోర్హాట్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శనివారం (జూన్ 13) జోర్హాట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆంటోనోవ్ ఆన్-32 అనే సైనిక రవాణా విమానం దురదృష్టవశాత్తూ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సిబ్బంది మరణించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ మేరకు మరణించిన జవాన్ల వివరాలను వెల్లడించింది.
మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని.. ఈ దుఃఖ సమయంలో వారికి అండగా నిలుస్తామని ఐఏఎఫ్ తెలిపింది. ఈ ప్రమాదం నుండి కో-పైలట్ ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని.. విచారణ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపింది.
చనిపోయిన ఐదుగురు జవాన్లు వీరే:
- స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్
- ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్
- సార్జెంట్ జితేంద్ర శర్మ
- అగ్నివీర్వాయు ఖేమరం కుమావత్
- అగ్నివీర్వాయు డానిష్ ఆలం
ఆంటోనోవ్ ఆన్-32 విమానం వివరాలు:
ఆంటోనోవ్ ఆన్-32 అనే రెండు ఇంజన్లు గల టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వర్క్తోర్స్ గా పనిచేస్తుంది. భారత అవసరాల కోసం సోవియట్ యూనియన్ (రష్యా)లో తయారు చేసిన ఈ విమానాలలో సుమారు 100 ఎయిర్ క్రాఫ్ట్ లు సేవలందిస్తున్నాయి.
►ALSO READ | భారత సైనిక చరిత్ర కొత్త అధ్యాయం..IMA నుంచి 9మంది తొలి మహిళా లెఫ్టినెంట్లు
ఏఎన్-32 విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితులలో రాణించేలా తయారు చేశారు. ఇది ఎత్తైన ప్రదేశాలలోని ఎయిర్ఫోల్డ్లలో, వేడి ఉష్ణమండల వాతావరణాలలో పనిచేస్తుంది. ఇది 7.5 టన్నుల వరకు సరుకును, 50 మంది ప్రయాణికులను లేదా 42 మంది పారాట్రూపర్లను మోసుకెళ్లగలదు. మారుమూల ప్రాంతాలలో సామాగ్రిని జారవిడవడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
