భారత సైనిక చరిత్రలో జూన్ 13, 2026 ప్రత్యేక రోజుగా నిలవనుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్‌లో తొలిసారిగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో శిక్షణ పొందిన మహిళా క్యాడెట్లు భారత సైన్యంలో అధికారులుగా కమిషన్ పొందారు. 9 మంది మహిళా క్యాడెట్లు ఈ చారిత్రాత్మక బ్యాచ్‌లో భాగమయ్యారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం వారు లెఫ్టినెంట్ హోదాతో భారత సైన్యంలో చేరారు. NDA ద్వారా ఎంపికైన మహిళా క్యాడెట్లు IMA నుంచి పాస్ అవుట్ అయి రెగ్యులర్ అధికారులుగా సేవలు ప్రారంభించడం ఇదే తొలిసారి.
శిక్షణ కాలంలో వీరు పురుష క్యాడెట్లతో సమాన ప్రమాణాలపై అన్ని సైనిక పరీక్షలు, శారీరక సవాళ్లు, యుద్ధ విన్యాసాల్లో తమ ప్రతిభను నిరూపించారు. ఈ ఘట్టం భారత సాయుధ దళాల్లో మహిళల పెరుగుతున్న పాత్రకు, వారి నాయకత్వ సామర్థ్యానికి చారిత్రాత్మక గుర్తింపుగా నిలవనుంది.
►ALSO READ | ఆమెకు 45, కుర్రోడికి 19 ఏళ్ళు... రాంగ్ నంబర్ కలిపింది ఇద్దరినీ..
1932లో స్థాపించబడిన ఐఎంఏ ఇప్పటివరకు వేలాది మంది పురుష సైనిక అధికారులను తయారు చేసింది. ఇప్పుడు మహిళా ఆఫీసర్ క్యాడెట్ల తొలి బృందం చేరడంతో అకాడమీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు.
