ఆమెకు 45 ఏళ్ళు, ఐదుగురు పిల్లల తల్లి కూడా...ఏం పోయేకాలం దాపురించిందో ఏమో కానీ..రాంగ్ నంబర్ ద్వారా పరిచయమైన కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మానవ సంబంధాలు రోజురోజుకీ ఇంత దిగజారిపోతున్నాయా అనిపిస్తోంది. బీహార్ లోని పూర్ణియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బీహార్ లోని పూర్ణియాకు చెందిన ఐదుగురు పిల్లల తల్లి అయిన 45 ఏళ్ళ మహిళ జమయికి చెందిన 19 ఏళ్ళ కుర్రాడిని పెళ్లి చేసుకుంది. ఇందుకోసం ఆమె తన మతాన్ని కూడా మార్చుకోవడం విశేషం. సదరు మహిళ మొదటి పెళ్లి సమయంలో కూడా మతం మార్చుకోవడం మరో విశేషం. రాంగ్ నంబర్ ద్వారా జరిగిన సంభాషణతో 19 ఏళ్ళ యువకుడితో ప్రేమాయణం మొదలుపెట్టింది ఆ మహిళ. ఆ యువకుడి ప్రేమలో ఆమె ఎంతగా మునిగిపోయిందంటే, పూర్ణియా నుండి కోల్కతాకు వెళ్లి మరీ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో మహిళను, యువకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారణ జరిపారు పోలీసులు. పదేళ్ల క్రితం పూర్ణియాలో తమకు పెళ్లి అయ్యిందని.. పూర్ణియాలోని ఇంటి నుండి కోల్కతాకు వచ్చి యువకుడిని పెళ్లి చేసుకుందని చెబుతున్నాడు ఆమె భర్త. పెళ్లి తర్వాత ఆమె ప్రవర్తన సరిగా ఉండేది కాదని.. ఐదుగురు పిల్లలను వదిలేసి కోల్కతాకు వచ్చిందని అంటున్నాడు భర్త.
గ్రామస్తుల ఫిర్యాదు ఆధారంగా వారిద్దరినీ పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించమని.. ఇద్దరు మేజర్లే కాబట్టి.. కలిసి జీవించాలని అనుకుంటున్నారు కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించామని అంటున్నారు పోలీసులు.
