తమిళనాడులో కొరియా భారీ పెట్టుబడులు: ఏటీఎంల తయారీ, కొత్త షిప్‌యార్డ్ ఏర్పాటు!

 తమిళనాడులో కొరియా భారీ పెట్టుబడులు: ఏటీఎంల తయారీ, కొత్త షిప్‌యార్డ్ ఏర్పాటు!

మనదేశంతో పాటు ప్రపంచ దేశాలకు అవసరమయ్యే ఏటీఎం (ATM) మెషీన్లను తయారు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ సంస్థ 'హ్యోసంగ్ టీఎన్ఎస్' తమిళనాడులో ఒక సరికొత్త ఫ్యాక్టరీని పెట్టాలని చూస్తోంది. ఈ విషయాన్ని తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన ఈ నెల 10వ తేదీన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "ఈ ప్రాజెక్టుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుంది, హ్యోసంగ్ సంస్థను తమిళనాడుకు సాధరంగా ఆహ్వానిస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు.

మంత్రి కొరియా పర్యటన విశేషాలు:
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కీర్తనకి ఇది మొదటి విదేశీ పర్యటన. ఈ సందర్భంగా ఆమె దక్షిణ కొరియా వెళ్లి, అక్కడ బ్యాంకింగ్ టెక్నాలజీలో టాప్‌లో ఉన్న హ్యోసంగ్ సంస్థ పైస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. తమిళనాడులో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి, కొత్త టెక్నాలజీ రంగాల్లో కలిసి ఎలా పనిచేయాలనే దానిపై వారు చర్చించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రంలో పరిశ్రమలను మరింత పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు.

తూత్తుకుడిలో భారీ షిప్‌యార్డ్ 
ఈ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి అక్కడి 'హెచ్‌డి హ్యుందాయ్ హెవీ ఇండస్ట్రీస్' సంస్థను కూడా సందర్శించారు. గత డిసెంబర్ (2025)లోనే తమిళనాడులోని తూత్తుకుడిలో ఒక పెద్ద ఓడల నిర్మాణ కేంద్రాన్ని (షిప్‌యార్డ్) కట్టడానికి, హ్యుందాయ్ సంస్థ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం దాదాపు రూ.40 వేల 000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నారు.

►ALSO READ | బాలికలకు రుతుస్రావ సెలవులపై భిన్నాభిప్రాయాలు : కేరళలో ఆసక్తికర చర్చ

ఈ ప్రాజెక్ట్ గురించి మంత్రి కీర్తన మాట్లాడుతూ... "భారతదేశం, దక్షిణ కొరియా దేశాల మధ్య కుదిరిన సముద్ర రవాణా ఒప్పందంలో ఇదొక గొప్ప ముందడుగు. ఈ ఫ్యాక్టరీ ద్వారా పెద్ద పెద్ద వ్యాపార నౌకలను (షిప్స్) తయారు చేయవచ్చు. ఇది భారతదేశ ఓడల నిర్మాణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది" అని ఎక్స్ ద్వారా వివరించారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే  ప్రస్తుతం తమిళనాడులో 150కి పైగా కొరియన్ కంపెనీలు నడుస్తున్నాయి. దాదాపు 4వేలకి  పైగా కొరియన్ కుటుంబాలు ఇక్కడే నివసిస్తూ, రాష్ట్రంలోనే అతిపెద్ద విదేశీ కమ్యూనిటీగా గుర్తింపు పొందాయి.