తొలి టెస్ట్ : భారీ ఆధిక్యంలో భారత్

తొలి టెస్ట్ :  భారీ ఆధిక్యంలో భారత్

భారత్,శ్రీలంక మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సరికి శ్రీలంక  నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది.   క్రీజులో అసలంక(1) పథుమ్ నిశాంక(26) పరుగులతో ఉన్నారు. ఓపెనర్లు. అంతకు ముందు భారత్  574/8 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.  శ్రీలంక ఓపెనర్లు కరుణ రత్నె 28, తిరుమన్నె 17, మ్యాథ్యూస్ 22 పరుగులు చేశారు. శ్రీలంక ఇంకా 466 పరుగుల వెనుకంజలో ఉంది భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు, జడేజా, బుమ్రాలు చెరో వికెట్ పడ్డాయి.

రవీంద్ర జడేజా 175 నాటౌట్ తో  గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కపిల్ దేవ్ పేరిట 35 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.  7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జడేజా.. 3 సిక్సర్లు, 17 ఫోర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ నుంచి 7వ స్థానంలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా జడేజా చరిత్రపుటల్లో నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు లెజండరీ ప్లేయర్ కపిల్ దేవ్ పై ఉండేది. 1986 లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ లో కపిల్ దేవ్ 7వ స్థానంలో వచ్చి 163 పరుగులు సాధించాడు. దాదాపు 35 ఏళ్లుగా ఏ ఒక్క భారతీయ ఆటగాడు కపిల్ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. కానీ, ఎట్టకేలకు రవీంద్ర జడేజా తన అద్భుతమైన ఆటతో కపిల్ రికార్డును అధిగమించాడు.