Asia Cup 2025: ఆఫ్ఘనిస్తాన్‌ను కాపాడిన 40 ఏళ్ళ అనుభవం.. లంకను కాదు బంగ్లాను టెన్షన్ పెడుతున్న నబీ

Asia Cup 2025: ఆఫ్ఘనిస్తాన్‌ను కాపాడిన 40 ఏళ్ళ అనుభవం.. లంకను కాదు బంగ్లాను టెన్షన్ పెడుతున్న నబీ

ఆసియా కప్ 2025 సూపర్-4 సమరం మరింత ఆసక్తికరంగా మారింది. గురువారం (సెప్టెంబర్ 18) అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసింది. ఒకదశలో స్వల్ప స్కోర్ ఖాయమనుకుంటే నబీ (22 బంతుల్లో 60: 6 సిక్సర్లు,3 ఫోర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కు ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగుల మాత్రమే చేయగలిగింది. నబీ ఇన్నింగ్స్ తో ఇప్పుడు సూపర్-4 రేస్ లో ఉన్న బంగ్లాకు టెన్షన్ మొదలయింది. 

గ్రూప్-బి లో సూపర్-4 కు రేస్ లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ ఆడిన తొలి ఇన్నింగ్స్ చూస్తుంటే బంగ్లాకు సూపర్-4 ఛాన్స్ లు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో తొలి 15 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల నష్టానికి కేవలం 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో ఆఫ్ఘనిస్తాన్ 140 పరుగులకే పరిమితమయ్యేలా కనిపించింది. ఆఫ్ఘనిస్థాన్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే బంగ్లాదేశ్ సూపర్-4 కు అర్హత సాధిస్తుంది. 

తొలి 15 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ చూస్తే బంగ్లా ఖుషీలో ఉన్నట్టు అర్ధమవుతోంది. అయితే నబీ విజృంభణకు బంగ్లాదేశ్ ఒత్తిడిలో పడింది. చివరి రెండు ఓవర్లలో ఏకంగా 49 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. నబీ 22 బంతుల్లోనే 6 సిక్సర్లు.. మూడు ఫోర్లతో అజేయంగా 60 పరుగులు చేశాడు. అబుదాబి లాటి పిచ్ పై 170 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడం ఏ జట్టుకైనా చాలా కష్టం. 

ALSO READ : Asia Cup 2025: 5 బంతులకు 5 సిక్సర్లతో నబీ తుఫాన్ ఇన్నింగ్స్.. లంక ముందు బిగ్ టార్గెట్

ఆఫ్ఘనిస్తాన్ లాంటి పటిష్టమైన బౌలింగ్ ను ఎదుర్కొని లంక గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు శ్రీలంక 101 పరుగులు చేస్తే చాలు సూపర్-4 కు అర్హత సాధిస్తుంది. భారీ స్కోర్ కొట్టడం ఆఫ్ఘనిస్తాన్ కు అనుకూలంగా మారితే.. 101 పరుగుల టార్గెట్ లంక జట్టుకు అనుకూలంగా మారింది. మధ్యలో బంగ్లాదేశ్ కు మాత్రం అసలు టెన్షన్. ఈ మ్యాచ్ శ్రీలంక 170 పరుగుల టార్గెట్ చేస్తే తప్పితే బంగ్లాదేశ్ సూపర్-4 కు అర్హత సాధించడం కష్టం.