- అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లండి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌ల నియామకం వ్యవహారంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నందున జోక్యం చేసుకోలేమంది. అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకే వెళ్లాలని సూచించింది. కోదండరాం, అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 26న జారీ చేసిన జీవో 71ను సవాల్చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ హైదర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న విషయాన్ని ప్రస్తావించారని, అందువల్ల ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పారు. అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు.
