Mohammed Shami: కేఎల్ రాహుల్ vs LSG ఓనర్ మధ్య గొడవ.. మొహమ్మద్ షమీ కౌంటర్

Mohammed Shami: కేఎల్ రాహుల్ vs LSG ఓనర్ మధ్య గొడవ.. మొహమ్మద్ షమీ కౌంటర్

Mohammed Shami: ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తరచుగా వివాదాల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా 2024 సీజన్‌లో అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. గత రెండు సీజన్లలో (2024, 2025) జట్టు ఏడో స్థానానికే పరిమితం కావడంతో అభిమానులు, క్రికెడ్ పండితులు లక్నో యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై ఆ జట్టు ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ టీమ్ ఓనర్ గోయెంకాకు మద్దతుగా నిలిచారు.

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన షమీ.. సంజీవ్ గోయెంకా ప్రవర్తనను సమర్థించారు. ఎవరైనా సరే ఒక జట్టుపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు, ఫలితాల గురించి ఆశించడం, ఆవేదన చెందడం సహజం అని పేర్కొన్నారు. వేల కోట్లు ఖర్చు చేసిన వ్యక్తికి జట్టు విజయంపై తపన ఉండటంలో తప్పుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడే మనుషులకు ఒత్తిడి ఉంటే, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఆ మాత్రం ఆందోళన ఉండటం సహజమని అన్నారు. 

ఇక సంజీవ్ గోయెంకా లక్నో ఫ్రాంచైజీని సుమారు రూ. 7,090 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు.. ఈ భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ను వివరిస్తూ షమీ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా ఒక వస్తువుపై రూ. 5,000 లేదా రూ. 10,000 పెడితేనే, ఆ డబ్బు ఎక్కడ పోతుందో అని 10 సార్లు గుండె కొట్టుకుంటుంది.. అలాంటిది వేల కోట్లు పెట్టిన వ్యక్తికి ఎంత టెన్షన్ ఉంటుందో అర్థం చేసుకోవాలి.. గోయెంకాపై వస్తున్న మీమ్స్, విమర్శలు సరికావు అని షమీ వెల్లడించారు. 

కాగాఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ విభాగాన్ని మహమ్మద్ షమీ ముందుండి నడిపించనున్నారు. జట్టులో మాయంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్ లాంటి యువ స్పీడ్ బౌలర్లు ఉన్నప్పటికీ, షమీ అనుభవం జట్టుకు కీలకంగా మారనుంది. గత రెండు సీజన్ల పాటు వైఫల్యాలను అధిగమించి, ఈసారి లక్నోను టాప్ టీమ్‌గా నిలబెట్టడంలో షమీ మార్గదర్శకత్వం ఎంతో అవసరం.