షాకింగ్ ఇన్సిడెంట్.. కంట్రోల్ తప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే చిన్నారి మృతి

షాకింగ్ ఇన్సిడెంట్.. కంట్రోల్ తప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే చిన్నారి మృతి

నిర్లక్ష్యం.. ఓ చిన్నారిని బలిగొంది.. మరో నలుగురికి ప్రాణాల మీదకు తెచ్చింది. కర్ణాటకలోని హవేరీ బస్టాండ్ లో  ఆర్టీ సీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్లాట్ ఫాంపై ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో  ఓ చిన్నారి  స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి  వెళితే..

కర్ణాటకలోని హవేలీ బస్టాండ్ లో బుధవారం తెల్లవారు జామున  ఘోర ప్రమాదం జరిగింది. ప్లాట్ ఫాం పైకి వస్తుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా ప్రయాణికుల పైకి దూసుకెళ్లింది. ప్లాట్ ఫాంపై ఉన్న చిన్నారితో సహా పలువురు ప్రయాణికులను ఢీకొట్టింది. ఈప్రమాదంతో చిన్నారి స్పాట్ లోనే చనిపోయింది. మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను  చికిత్సకోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. 

ప్రమాదం ఎలా జరిగిందంటే.. 

హవేరి ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం..బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బస్సు డ్రైవర్ మంజునాథ్  బస్సును ప్లాట్‌ఫారంపై పార్క్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ సంఘటన జరిగింది. శిక్షణ పొందుతున్న ఆ డ్రైవర్ బ్రేకులకు బదులుగా యాక్సిలరేటర్‌ను పొరబడి గట్టిగా నొక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.ఎనిమిది నెలల క్రితం సర్వీసులో చేరిన మంజునాథ్ ఒక శిక్షణ పొందుతున్న డ్రైవర్. అతనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించింది కర్ణాటక ఆర్టీసీ యాజమాన్యం.