
ఐపీఎల్ సీజన్-18లో కీలక మ్యాచ్ ఆడుతున్న చెన్నై జట్టుకు SRH పేసర్ షమీ తొలి బంతికే షాకిచ్చాడు. మ్యాచ్ అలా మొదలైందో.. లేదో.. షమీ బౌలింగ్ చేసిన ఫస్ట్ బాల్కే చెన్నై ఓపెనర్ షేక్ రషీద్ వికెట్ తీశాడు. షమీ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్గా దొరికిపోయి షేక్ రషీద్ ఒక్క పరుగు కూడా సాధించకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ముంబైతో జరిగిన ఉప్పల్ మ్యాచ్లో షమీని పక్కనబెట్టేసిన SRH చెన్నైతో మ్యాచ్కు జట్టులోకి తీసుకుంది.
స్వల్పంగా మంచు కురుస్తూ పిచ్ తేమగా ఉండటంతో తొలుత బౌలింగ్ తీసుకుని చెన్నైని తక్కువ పరుగులకే కట్టడి చేయాలని భావించిన SRH కెప్టెన్ కమ్మిన్స్ వ్యూహం ఫలిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. షమీ బౌలింగ్‌లో స్లిప్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా షేక్ రషీద్ వెనుదిరగడంతో శామ్ కరన్ క్రీజులోకి వచ్చాడు. ఆయుష్ మాత్రే, శామ్ కరన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. బౌలింగ్ పర్లేదనిపిస్తున్నా SRH బ్యాటింగ్ కలవరపెడుతుంది. భారీ స్కోరుతో ఈ సీజన్‌ను ధాటిగా ప్రారంభించిన సన్ రైజర్స్ తర్వాత అనూహ్యంగా తడబడింది.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ గత సీజన్‌లో ఆకట్టుకున్నా ఈసారి ఎక్కువ ప్రభావం చూపలేకపోయారు. అభిషేక్ ఒకటి రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరిసినా హెడ్ పూర్తి స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈ ఇద్దరిపై అతిగా ఆధారపడటం, ఇషాన్ కిషన్తో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు తేలిపోవడంతో సన్ రైజర్స్ పూర్తిగా డీలా పడింది. ముంబైతో గత పోరులో టాప్–4 బ్యాటర్లంతా కలిసి 13 రన్స్ కూడా చేయలేకపోవడంతో జట్టు ఘోరంగా ఓడిపోయింది. రైజర్స్ తిరిగి గాడిలో పడాలంటే బ్యాటర్లంతా సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.
FCKK this csk team 😭 wicket on 1st ball of innings. What a seam bowl by shami 👏.#CSKvsSRH #SRHvsCSK pic.twitter.com/x7CVlnN63D
— Ashish (@Ashishh_____) April 25, 2025