టీ20 వరల్డ్ కప్ ఆడాలని ఉంది..సెలక్ట్ అవ్వాలంటే అదొక్కటే మార్గం: షమీ

టీ20 వరల్డ్ కప్ ఆడాలని ఉంది..సెలక్ట్ అవ్వాలంటే అదొక్కటే మార్గం: షమీ

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టీ20 క్రికెట్ ఆడక 14 నెలలు కావొస్తుంది. టెస్టుల్లో, వన్డేల్లో అదరగొడుతున్న షమీ.. టీ20ల్లో మాత్రం సెలక్టర్లు రెస్ట్ ఇస్తూ వచ్చారు. అయితే షమీ భవిష్యత్తులో టీ20లు ఆడతాడా లేదా  అనే విషయంలో సందిగ్దత నెలకొంది. యంగ్ ప్లేయర్స్ రాణిస్తుండడంతో ఈ సీనియర్ పేసర్   జట్టులోకి రావడం కష్టమే అనిపిస్తుంది. అయితే తనకు టీ20 వరల్డ్ కప్ ఆడాలని ఉందని తాజాగా షమీ తన మనసులో మాట బయటపెట్టాడు. 

వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నానని..అయితే సెలక్టర్లు తనను పట్టించుకుంటారో లేదో తెలియదని చెప్పాడు.  టీ20 వరల్డ్ కప్ రేస్ లో నేనున్నానో లేదో నాకు అర్ధం కావడం లేదని.. ఐపీఎల్ ఆడితే ఈ మెగా టోర్నీకి అవకాశం దక్కుతుందని షమీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో బాగా రాణిస్తే సెలక్టర్లు నన్ను సంప్రదిస్తారని.. అప్పుడు వరల్డ్ కప్ ఆడేందుకు నేను సిద్ధంగా ఉంటానని షమీ అన్నారు.

షమీ భారత్ తరపున నాలుగు T20 ప్రపంచ కప్ లు ఆడాడు. 2014, 2016, 2021, 2022 లో ఈ వెటరన్ పేసర్ జట్టులో భాగంగా ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 23 టీ20లు ఆడిన షమీ.. 24 వికెట్లు పడగొట్టాడు. దశాబ్ద కాలంగా జట్టులో కొనసాగినా.. షమీకు మెగా టోర్నీలోనే ఎక్కువగా అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా..షమీ రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున పురస్కారాన్ని అందుకున్నాడు. మొత్తం 23 మంది అర్జన అవార్డును తీసుకున్నారు. అందులో అవార్డు తీసుకున్న ఏకైక క్రికెటరగా షమీ నిలిచాడు.        

వరల్డ్ కప్ లో చివరిసారిగా ఆడిన షమీ ఆ తర్వాత టీంఇండియాలో కనిపించలేదు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. షమీ 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ అసాధారణ బౌలింగ్ చేసాడు. ప్రారంభ మ్యాచ్ ల్లో అవకాశం రాకపోయినా.. ఆ తర్వాత ఆడిన 7 మ్యాచ్ ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు.