వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్‌‌.. మోహన్‌‌‌‌కు సిల్వర్

వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్‌‌.. మోహన్‌‌‌‌కు సిల్వర్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి టోర్నమెంట్‌‌‌‌లో తెలుగు పారా రన్నర్  మోహన్‌‌‌‌ సత్తా చాటాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న మెగా టోర్నీలో సిల్వర్‌‌‌‌‌‌‌‌తో మెరిశాడు. మెన్స్ టి47 కేటగిరీ 100 మీటర్ల స్ప్రింట్‌‌‌‌లో మోహన్ 11.2 సెకండ్లలో టార్గెట్‌‌‌‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు.

గచ్చిబౌలి స్టేడియంలో కోచ్‌‌‌‌ సాయి వీర మణికంఠ వద్ద శిక్షణ పొందుతున్న మోహన్‌‌‌‌కు వరల్డ్ పారా గ్రాండ్ ప్రిలో ఇది రెండో మెడల్. 2023లో జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిలోనూ తను సిల్వర్ గెలిచాడు.