త్వరలో అలోన్ సినిమా రిలీజ్

త్వరలో అలోన్ సినిమా రిలీజ్

నలభయ్యేళ్లుగా రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తున్నా.. ఇప్పటికీ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు మోహన్‌‌‌‌లాల్. ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయోగానికి తెర తీస్తూనే ఉంటారాయన. అందుకు ఉదాహరణ ఆయన చేస్తున్న సినిమాలే. ప్రస్తుతం ఆయన చేతిలో తొమ్మిది సినిమాలున్నాయి. ఒక్కోటీ ఒక్కో జానర్. ఇక ‘అలోన్’ అయితే అన్నిట్లోకీ స్పెషల్. షాజీ కైలాస్ డైరెక్షన్‌‌‌‌లో ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది.  దాన్ని మోహన్‌‌‌‌లాల్ పోషిస్తున్నారు. మరికొన్ని క్యారెక్టర్స్ ఉన్నా వాటి వాయిస్‌‌‌‌లు మాత్రమే వినిపిస్తాయి. ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది.

కేవలం పద్దెనిమిది రోజుల్లో తీసేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు. నిన్న టీజర్‌‌‌‌‌‌‌‌ను వదిలారు. కొవిడ్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో నడిచే కథ ఇది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌‌‌‌లో పని చేసే కాళిదాస్ అనే వ్యక్తిగా లాల్ కనిపిస్తున్నారు. మాస్క్‌‌‌‌ పెట్టుకుని ఎవరో పేషెంట్‌‌‌‌తో మాట్లాడుతున్నారు. ఇంట్లో ఒంటరిగా టైమ్‌‌‌‌ పాస్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కడికో సీరియస్‌‌‌‌గా బయలుదేరారు. ఒన్‌‌‌‌ మేన్ షో కనుక ఇది ఆయన నట విశ్వరూపాన్ని చూపించే సినిమా అనిపిస్తోంది. అయితే ఇలాంటి సినిమా రావడం ఇదే మొదటిసారి కాదు. ఆల్రెడీ పార్థిబన్ లాంటి వాళ్లు ఈ ఎక్స్‌‌‌‌పెరిమెంట్ చేశారు. అయితే మోహన్‌‌‌‌లాల్ లాంటి స్టార్ హీరో కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌ అన్నింటినీ పక్కనపెట్టి ఇలాంటి సినిమా చేయడం మాత్రం నిజంగా విశేషమే.