కిర్రాక్‌‌ లుక్

కిర్రాక్‌‌ లుక్

తన వారసుల కోసం నాలుగొందల సంవత్సరాల క్రితం వాస్కోడిగామా ఒకచోట పెద్ద నిధిని దాచాడని అంటుంటారు. దానికి ‘బారోజ్’ అనే భూతం కాపలాగా ఉంటుందని కూడా చెబుతుంటారు. ఈ విషయాన్ని బేస్ చేసుకుని ఓ సినిమా ప్లాన్ చేశారు మోహన్‌‌లాల్. ‘బారోజ్’ పేరుతో ఈ చిత్రాన్ని స్వయంగా తెరకెక్కించడంతో పాటు టైటిల్ రోల్‌‌ని కూడా పోషిస్తున్నారు. తాజాగా ఆయన లుక్‌‌ బైటికి వచ్చింది. పొడవాటి గడ్డం, గుబురు మీసాలు, నున్నటి గుండు, దానిమీద పచ్చబొట్లతో చాలా డిఫరెంట్‌‌గా ఉన్నారు లాల్. భారీ బడ్జెట్‌‌తో, త్రీడీ ఫార్మాట్‌‌లో ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే మార్చ్‌‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంచితే ఈ మూవీ టీమ్‌‌ ఇటీవల ఫుట్‌‌బాల్ వరల్డ్‌‌ కప్‌‌కి ట్రిబ్యూట్‌‌గా ఓ వీడియోని కూడా విడుదల చేసింది. ఈ పాటను మోహన్‌‌లాలే పాడటం విశేషం. వీడియోలో ఆయన ఆట ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ  ఎప్పుడూ లేనంత 
జోష్‌‌తో కనిపించి ఆకట్టుకున్నారు.