నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ అథ్లెట్ మోహిత్ చౌదరి మరో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరవగా.. బద్ది వైశాలి సిల్వర్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సత్తా చాటింది. భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కళింగ స్టేడియంలో సోమవారం జరిగిన మెన్స్ అండర్-20 విభాగం 3000 మీటర్ల రన్ ఫైనల్లో మోహిత్ 8 నిమిషాల 13.63 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.  అండర్-18 గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెప్టాథ్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైశాలి మొత్తం 4477 పాయింట్లు సాధించి రజత పతకం  కైవసం చేసుకుంది.