రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోతుల బీభత్సం.. మూడేళ్ల చిన్నారిపై దాడి.. తీవ్ర గాయాలు ..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోతుల బీభత్సం.. మూడేళ్ల చిన్నారిపై దాడి..  తీవ్ర గాయాలు ..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోతులు బీభత్సం సృష్టించాయి.ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారిపై కోతులు దాడి చేయడంతో  తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ( జూన్ 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కోతులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని బొప్పాపూర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అన్వికపై దాడికి చేశాయి కోతులు.

కోతులు దాడి చేసే సమయంలో చిన్నారి అన్విక కేకలు విని వెంటనే కోతులను తరిమికొట్టింది తల్లి. కోతుల దాడిలో అంవికకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

►ALSO READ | రూ. 84 కోట్లు కట్టినా నో లోన్.. మెట్రో నిధులు కిషన్ రెడ్డి వల్లే ఆగినయ్: సీఎం రేవంత్

గ్రామంలో కోతులు, కుక్కల బెడదతో భయాందోళనకు గురవుతున్నామని అంటున్నారు గ్రామస్తులు. కోతుల సమస్యపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. చిన్నారులు బయట ఆడుకోవాలంటే భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.