గండం గడిచింది.. తీరం దాటిన తౌక్టే సైక్లోన్

గండం గడిచింది.. తీరం దాటిన తౌక్టే సైక్లోన్

దేశంలో పశ్చిమ తీరంపై తౌక్టే తీవ్ర తుఫాను బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర, గురజాత్, గోవా కోస్టల్ ఏరియాపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత గుజరాత్‌లో తీరన్ని తాకిందని భారత వాతవరణ శాఖ ప్రకటించింది. తీరాన్ని తాకే టైంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. డయ్యూలో 3 మీటర్ల ఎత్తుతో అలలు ఎగసి పడ్డాయి. ప్రస్తుతం తౌక్టే సౌరాష్ట్ర ఏరియాపై కేంద్రీకృతమై ఉందని, అమ్రేలికి దక్షిణాన 20 కిలోమీటర్ల దూరంలో ఉందని స్పష్టం చేసింది. క్రమంగా ఉత్తర-ఈశాన్యం వైపు కదులుతోన్న తుఫాన్.... మెల్లగా బలహీన పడుతోందని వాతావరణ శాఖ చెప్పింది.

తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్రలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మంది గాయపడ్డారు. సైక్లోన్ వల్ల కలిగిన నష్టంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే రివ్యూ చేశారు. తీవ్రమైన గాలుల కారణంగా పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించిన తర్వాత ట్రాన్స్ పోర్టేషన్ ప్రారంభమవుతుందని సీఎం ఆఫీసు స్పష్టం చేసింది. 

ముంబైలో గంటకు 114 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సిటీని భారీ వర్షం ముంచెత్తింది. తుఫాన్ కారణంగా విమానా సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. భారీ గాలుల కారణంగా బాంద్రా,వర్లి సీ లింక్ మార్గాన్ని మూసివేశారు. చాల వరకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

భారత వాతవరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో తీర ప్రాంతంలోని లక్షలాది మందిని గుజరాత్ సర్కార్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుఫాన్ ప్రభావంతో డయ్యూ, సౌరాష్ట్ర ఏరియాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దాంతో సహాయక చర్యలకోసం గుజరాత్ సర్కార్ రెస్క్యూ టీంలను రంగంలోకి దింపింది. కరోనా చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసింది. అత్యవసరంగా పేషంట్లను తరలించేందుకు వందలాది అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. గుజరాత్‌లో సహాయక చర్యల కోసం నేవీని సిద్ధంగా  ఉంచారు. పరిస్థితిని ఆర్మీ కంటిన్యూస్‌గా మానిటర్ చేస్తోంది. 180 రిలీఫ్ అండ్ రెస్క్యూ, 9 ఇంజినీర్ టాస్క్ ఫోర్స్  టీమ్స్ స్టాండ్ బైగా ఉన్నాయని గుజరాత్ సర్కార్ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇక కర్ణాటకలో తుఫాను కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, కొడగు, చిక్క మగళూరు, హసన్, బెళగావి జిల్లాల్లోని 121 గ్రామాలపై సైక్లోన్ ఎఫెక్ట్ చూపింది. కేరళలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1500 ఇళ్లు తుఫాను కారణంగా ధ్వంసమయ్యాయని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు.