
కోల్‌కతా: అమెజాన్, సమారా క్యాపిటల్- మద్దతు గల సూపర్ మార్కెట్ చెయిన్ మోర్ రిటైల్ ఐపీఓ ద్వారా దాదాపు రూ. 2,000 కోట్లు సేకరించాలని యోచిస్తోంది. 2026 క్యాలెండర్ సంవత్సరంలో మార్కెట్‌లోకి వస్తామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా భారీగా నిధులను సేకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా వాటాలు అమ్మే అవకాశాలు కనిపించడం లేదు.
మోర్లో అమెజాన్‌కు 51 శాతం, సమారాకు 48 శాతం వాటా ఉంది. వాల్యుయేషన్ మార్కెట్ పరిస్థితులను బట్టి 12–18 నెలల్లో ఐపీఓకు రావాలని కోరుకుంటున్నామని, ప్రస్తుత ప్రమోటర్ డైల్యూషన్ దాదాపు 10 శాతం వరకు ఉండవచ్చని మోర్ రిటైల్ ఎండీ వినోద్ నంబియార్ అన్నారు. 2030 నాటికి స్టోర్ కౌంట్‌ను 3,000లకు పెంచడానికి, కంపెనీని దాదాపు రుణ రహితంగా చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తామని ఆయన అన్నారు.