న్యూయార్క్ లో 10 వేలు దాటిన మరణాలు

న్యూయార్క్ లో 10 వేలు దాటిన మరణాలు
  • అమెరికాలో సగం మృతులు అక్కడే
  • త్వరలో పరిస్థితి కుదుటపడుతుందన్న గవర్నర్ ఆండ్రూ క్యూమో

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ సిటీ లో కరోనా విజృంభిస్తోంది. ఆ ఒక్క సిటీలోనే మృతుల సంఖ్య 10 వేలు దాటింది. అమెరికాలో మొత్తం 23 వేల మందికిపైగా మరణిస్తే.. సగానికిపైగా మరణాలు న్యూయార్క్ లోనే నమోదయ్యాయి. చైనా, బ్రిటన్ తో పోలిస్తే ఒక్క న్యూయార్క్ సిటీలోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 671 మంది చనిపోయారని, మృతుల సంఖ్య 10,056కు పెరిగిందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమో చెప్పారు. అయితే గతంలో రోజుకు 750 మరణాలు నమోదయ్యాయని,వాటితో పోలిస్తే ఇది తక్కువని ఆయన అన్నారు. రెండు వారాల్లో కొత్త పేషెంట్ల సంఖ్య తగ్గిందన్నారు. పరిస్థితి త్వరలో కుదుట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కెపాసిటీకి మించి హాస్పిటళ్లకు పేషెంట్లు వచ్చినా హెల్త్ వర్కర్స్ పని చేస్తున్నారని, ఇది మంచి పరిణామమని అన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. త్వరలో మామూలు స్థితికి చేరుకుంటామని, ఎక్స్ పర్ట్స్ సూచన మేరకు ఎకానమీని రీఓపెన్ చేస్తామన్నారు. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువలో ఉంటే ఒక్క న్యూయార్క్ లో నే 2 లక్షలకు చేరువలో ఉంది.