మూడు దేశాల్లో 50 వేల‌కు పైగా కేసులు..30 దేశాల్లో వెయ్యికి పైనా క‌రోనా కేసులు

మూడు దేశాల్లో 50 వేల‌కు పైగా కేసులు..30 దేశాల్లో వెయ్యికి పైనా క‌రోనా కేసులు

వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ వ‌ర‌ల్డ్ వైడ్ గా రోజుకి ఎన్నిదేశాల్లో ఎన్నిక‌రోనా కేసులు న‌మోదవుతున్నాయో తెలుపుతూ ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది.

ఆ నివేదిక ప్ర‌కారం సుమారు 30 దేశాల్లో రోజుకు వెయ్యి కేసులు న‌మోదవుతున్న‌ట్లు తెలిపింది.లాటిన్ అమెరికా,యూరప్ మరియు ఆసియాలో ప్ర‌తిరోజు 1,000 నుంచి 10,000 కేసులు న‌మోదవుతున్న‌ట్లు ప్ర‌ముఖ మీడియా సంస్థ జిన్హువా నివేదించింది.

పెరూలో కొత్తగా 9,441 కేసులు, అర్జెంటీనాలో 7,498 కేసులు నమోదయ్యాయి. మెక్సికో- 7,371 , చిలీ – 2,077, బొలీవియా – 1,388, డొమినికన్ రిపబ్లిక్ – 1,354, వెనిజులా -1,281, గ్వాటెమాల – 1,144, కోస్టా రికా – 1,072, పనామా – 1,069, ఈక్వెడార్ – 1,066 , ఐరోపాలో, స్పెయిన్ – 5,479, రష్యా – 5,061, ఫ్రాన్స్‌ – 2,667, ఉక్రెయిన్ – 1,847 యూకే -1,440, జర్మనీ,రొమేనియా – 1,415 ఆసియా, ఫిలిప్పీన్స్ – 6,134, ఇరాక్ – 4,013 ఇరాన్ – 2,501 బంగ్లాదేశ్ – 2,766 ఇండోనేషియా – 2,307, కజకిస్తాన్ – 1,847, సౌదీ అరేబియా -1,383, జపాన్ – 1,360, టర్కీ – 1,226

ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, మొరాకో మరియు ఇథియోపియాలో 1,000 నుంచి 10,000 మధ్యలో కేసులు న‌మోద‌వుతుండ‌గా తాజాగా 6,275, 1,306, 1,038 కొత్త కేసులు నమోదయ్యాయి.

మ‌నదేశంలో రోజువారీ కొత్తగా -65,002 కేసులు నమోదు చేయగా, బ్రెజిల్- 60,091, యుఎస్- 52,799, కొలంబియా- 11,286 కేసులు న‌మోద‌య్యాయి.