గండిపేట, వెలుగు: కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌పై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌కు చెందిన సంగీత, ఆమె కూతురు కలిసి పక్కనుండే మరో మహిళతో గొడవ పడ్డారు.
స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు చేరుకున్నారు. ఓ కానిస్టేబుల్ ట్యాబ్‌లో వీడియో తీస్తుండగా మరో లేడీ కానిస్టేబుల్ గొడవపై వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సంగీత ట్యాబ్‌ను లాక్కొని పగులగొట్టింది. అంతేగాకుండా మహిళా కానిస్టేబుల్‌పై తల్లీకూతుళ్లు దాడికి పాల్పడ్డారు.
కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేరీ, ఆమె కుమార్తె లపై రాజేంద్రనగర్ పోలీసులు 221 132, 74, 351(2), 352, 324(4) రెడ్ విత్ 3,5 బీఎన్ఎస్. 3పీడీపీపీఏ సెక్షన్ ల ప్రకారం కేసు లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....
