తల్లి ప్రేమను చాటుకున్న శునకం

తల్లి ప్రేమను చాటుకున్న శునకం

ప్రేమకు మనుషులే కాదు.. జంతువులు కూడా అతీతమేం కాదు. అందులోనూ తల్లి ప్రేమ.. ఈ సృష్టిలో అత్యంత తీయనైనది, పోల్చలేనిది, వర్ణించలేనిదంటూ ఉంటే అది అమ్మ ప్రేమే. తల్లి ఒడిలో నిద్రపోయే చంటిపాప ఎంత హాయిగా నిద్ర పోతుందో.. అంతే భద్రత ఉంటుందని నమ్ముతుంది. అయితే ఇలాంటి విషయాల్లో కేవలం మనుషులే కాదు.. జంతువులు కూడా తమ తల్లి ప్రేమను చాటడం, అందులోని మాధూర్యాన్ని పంచడం చూస్తూనే ఉంటాం. అది కేవలం సంతోషం విషయంలోనే కాదు.. విషాద సమయంలోనూ ఆ అమ్మతత్వం బహిర్గతమవుతుంది. అదే తరహాలో ఓ శునకం కూడా తల్లి ప్రేమను చాటుకోవడం.. నిజంగా అందర్నీ కలచివేస్తోంది.

కుత్బుల్లాపూర్ పరిధి దేవేందర్ నగర్ మేన్ లో రోడ్డుపై ఓ కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో పేగులు బయట పడి ఆ కుక్కపిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్న తల్లి కుక్క అది చూసి తన పిల్లను నోటితో పక్కకు లాక్కెళ్ళింది. ఓ బండారాయి చాటున పిల్లను పెట్టి, పూడ్చడానికి గుంత తీస్తుండటం చూపురులు ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కుక్కపిల్ల పట్ల తల్లి ప్రేమను చూసిన స్దానికులు చలించిపోయారు.