చిన్నారి మృతి కేసు.. నిమ్స్ హాస్పిటల్లో హై డ్రామా..

చిన్నారి మృతి కేసు.. నిమ్స్ హాస్పిటల్లో హై డ్రామా..

జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి నిమ్స్ హాస్పిటల్లో హై డ్రామా నెలకొంది. ప్రమాదంలో చనిపోయిన చిన్నారి తల్లి కాజల్కు కూడా గాయాలు కావడంతో ఆమెను ట్రీట్మెంట్ కోసం నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సడెన్గా అదృశ్యమైంది. ఒకవైపు చిన్నారి మృతి చెందడం.. మరోవైపు తల్లి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.  ఆమె ఆచూకీ గురించి హాస్పిటల్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. బాధితురాలితో పాటు ఆమె అత్త కూడా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆచూకీ చెబితే తాము మహారాష్ట్ర తిరిగి వెళ్లిపోతామని అంటున్నారు.

నిన్న రాత్రి 10 గంటల సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-45 వైపు వస్తున్న  కారు ముగ్గురు యాచక మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ చేతిలోని రెండున్నర నెలల చిన్నారి కిందపడటంతో తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు. ప్రమాదం అనంతరం కారు నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోగా..  గాయపడిన ముగ్గురిని హాస్పిటల్ కు తరలించారు.