- లిటిల్ ఫ్లవర్ ఫ్యాకల్టీపై చర్యలు తీసుకోవాలి
- బాధితురాలి తల్లి డిమాండ్
బషీర్‌బాగ్, వెలుగు: తన కూతురిని తోటి విద్యార్థుల ముందు దూషించి, ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించేలా వేధించిన ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఫ్యాకల్టీపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లి డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో మానవ హక్కుల సంఘం నేతలు దీప్తి, భానుమూర్తితో కలిసి ఆమె మాట్లాడారు.
అనారోగ్యం కారణంగా కాలేజీకి వెళ్లలేకపోయిన తన కూతురికి, మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినా అటెండెన్స్ సాకుతో హాల్ టికెట్ ఇవ్వకుండా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమను అవమానపరిచిందని, తక్షణమే క్షమాపణ చెప్పి విద్యార్థిని పరీక్షలు రాసేలా చూడాలని కోరారు. గత నెల 28న ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
