అందరూ చూస్తున్నారు.. అరుస్తున్నారు..ఒక్కరూ సాహసం చేయలేదు.. కానీ ఆ తల్లి ఇంకే ఆలోచించలేదు..బిడ్డను కాపాడటమే లక్ష్యం.. ఎగిసిపడుతున్న సముద్ర కెరటాల్లోకి గబుక్కున దూకేసింది.. బిడ్డను గట్టిగా పట్టుకుంది.. దాదాపు సముద్రకెరటాల్లో కొట్టుకుపోయే పరిస్థితి.. ధైర్యం వీడలేదు.. అలాగే బిడ్డను ఒడిసి పట్టుకొని ఒడ్డుకు చేరింది. ఏ బీచ్ లో జరిగిందో స్పష్టత లేదుగానీ సముద్రంలో కొట్టుకుపోతున్న కన్నబిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన సాహసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల మనుసు దోచుకుంటోంది.
పిల్లలకోసం ఓ తల్లి తప్పా మరెవరూ అంతగా సాహించలేరని ఈ ఘటన రుజువు చేస్తోంది. సమీపంలో చాలా మంది ఉన్నా ఎవరూ ధైర్యం చేయలేదు.. కానీ ఆ తల్లి మరో ఆలోచన లేకుండా సముద్రంలో దూకేసింది.
ఒక తల్లి తన పిల్లల కోసం ఏదైనా చేయగలదు. అందరూ చూస్తున్నారు, అందరూ అరుస్తున్నారు కానీ ఆ బిడ్డను కాపాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక తల్లి తన బిడ్డ గురించి ఆలోచించకుండా నీళ్లలోకి దూకింది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లి సాహసానికి ఫిదా అయిపోయారు. ‘‘పిల్లల మీద తల్లికి ఉండే ప్రేమ నిజంగా అద్భుతమైనది, సాటిలేనిది. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో గుమిగూడిన చాలామంది ఉన్నారు. ఆ తల్లి, తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా..మరో ఆలోచన లేకుండా నీటిలోకి దూకింది’’. అని పొగడ్తల కామెంట్లతో ముంచెత్తారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘ఒక తల్లి తన పిల్లల కోసం ఏదైనా చేస్తుంది. అందరూ చూస్తూ అరుస్తున్నారు, కానీ ఆ బిడ్డను కాపాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక తల్లి, రెండవ ఆలోచన లేకుండా, తన పిల్లల కోసం నీటిలోకి దూకింది’’ అని ఆమె సాహసాన్ని ప్రశంసించారు.
‘‘తల్లి తన బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది..ఈ ప్రపంచంలో తల్లి కంటే గొప్పవారు ఎవరూ లేరు’’.అంటూ మరో నెటిజన్ అన్నారు.
समुन्द्र की तेज लेहरो ने अचानक बच्चे को खींच लिया सब लोग देखते रहे लेकिन माँ ने बिना कुछ सोचे समझें अपने बच्चे को बचा लिया।
— 𝗠𝗮𝗿𝗶𝘆𝗮𝗺_𝗠𝗕𝗗 (@Mariyam_MBD) May 25, 2026
जब पता है यहाँ खतरा है फिर जाना ही क्यों है। pic.twitter.com/cQgZ8NLj7N
