Alert : ఫోన్ మాట్లాడుతూ పిల్లోడిని ఫ్రిజ్ లో పెట్టిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగింది..?

Alert : ఫోన్ మాట్లాడుతూ పిల్లోడిని ఫ్రిజ్ లో పెట్టిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగింది..?

ఫోన్.. ఫోన్.. ఫోన్.. నిద్ర లేచిన కానుంచి ఫోన్లో ఉంటారు కొందరు..గతంలో నిద్రలేచిన తర్వాత దేవుడి ఫొటో చూసేవారు లేదా ఇంట్లో ఇష్టమైన వ్యక్తుల ముఖం చూసేవారు అదీ కాకపోతే తమ అరచేతులను చూసుకుంటారు..భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఇది ఒకటి.. ఇప్పుడు అంతా మారిపోయింది.. జగమంతా ఫోన్ మయం అయిపోయింది.. సెల్ ఫోన్ పిచ్చిలో పడి జీవితాన్నే మర్చిపోతున్నారు.. ఇంట్లోని మనుషులతోనే మాట్లాడటం మానేశారు.. తిన్నా పడుకున్నా నడుస్తున్నా కూర్చున్నా.. చివరికి బాత్రూంలో ఉన్నా ఫోన్ లేనిదే ఉండలేకపోతున్నారు జనం. కుటుంబం కుటుంబం ఫోన్ లో పడిపోయింది.. జీవితాలను మర్చిపోయింది.. ఇలాంటి వారి కోసం ఫోన్ ఎడిక్షన్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూపిస్తుంది ఈ వీడియో..

స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ అనేది ప్రపంచ వ్యాప్త సమస్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది ప్రజలు వాస్తవ ప్రపంచానికి దూరంగా సెల్ ఫోన్లతో గడుపుతున్నారు. సెల్ ఫోన్ లో నిమగ్నమై ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి దిగజారుతున్నారు. ఈ వీడియాలో ఓ మహిళ ఫోన్ లో మాట్లాడుతూ బిజీగా ఉండగా.. తన చుట్టూ ఆమె పసిపాప ఆడుతున్నట్లు కనిపిస్తుంది. ఒకానొక సమయంలో కూరగాయలను కట్ చేస్తుంది.. అయితే కట్ చేసిన కూరలను ఫ్రిజ్ లో పెట్టేందుకు బదులుగా తన పొల్లొడిని తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టి డోర్ వేసినట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. 

తన భర్త ఇంటికి వచ్చి పాప గురించి ఆరా తీయడంతో అప్పుడు తన పాప కనిపించకుండా పోయినట్లు గుర్తిస్తుంది.ఇద్దరు తల్లిదండ్రులు ఆతృతగా బిడ్డను వెతకడం ప్రారంభిస్తారు. ఫ్రిజ్ లోంచి బేబీ సౌండ్ రావడం గుర్తిస్తాడు తండ్రి. వెంటనే ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి బేబీ ని రక్షిస్తాడు. అదృష్టం బాగుండి పిల్లాడికి ఏం కాలేదని వీడియో చూస్తే తెలుస్తుంది. 

హానిబేల్ అడిక్షన్.. అనే శీర్షికతో ఈవీడియోను x లో  పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 3.9 లక్షల మంది చూశారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.  ఓ నెటిజన్ స్పందిస్తూ.. దయచేసి సెల్ ఫోన్లలో పడి పిల్లలను పట్ల అజాగ్రత్తగా ఉండకంటి అని సలహా ఇచ్చారు. అయితే ఈ వీడియో కావాలనే షూట్ చేశారు అని చాలామంది నెటిజన్లు వాదించారు. ఈ  సీన్ లో నటించిన వారు ఆస్కార్ కు అర్హులు అని రాశాడు. ఆమె మండిపోతున్న ఎండలనుంచి పసివాడిని కాపాడే ప్రయత్నం చేసిందంటూ.. మరో నెటిజన్ ఫన్నీగా రాశాడు. 

ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయినట్లుగా కనిపించే ఈ టైమ్ ల్యాప్స్ వీడియో ఇది. ఇది కేవలం సెల్ ఫోన్ కు ఎడిక్ట్ అయిన ఎవరైనా ఉంటే అలెర్ట్ కావడానికి చేసిన వీడియో.