హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో మోటోహాస్ షోరూమ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో మోటోహాస్ షోరూమ్

హైదరాబాద్​, వెలుగు: మల్టీ బ్రాండ్ ప్రీమియం టూ వీలర్ సంస్థ మోటోహాస్  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో  షోరూమ్‌‌‌‌‌‌‌‌ను  ప్రారంభించింది.  హైందవి ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ భాగస్వామ్యంతో ప్రీమియం యూరోపియన్ బ్రాండ్లు అయిన బ్రిక్స్​టన్​ బైక్స్​, వీఎల్ఎఫ్ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది.  

ఇది దేశంలో కంపెనీకి 14వ షోరూమ్. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 16 షోరూమ్‌‌‌‌‌‌‌‌లను తెరవాలని మోటోహాస్  యోచిస్తోంది. ఈ సందర్భంగా బ్రిక్స్​టన్ క్రాస్‌‌‌‌‌‌‌‌ఫైర్ 500ఎక్స్, క్రాస్‌‌‌‌‌‌‌‌ఫైర్ 500ఎక్స్‌‌‌‌‌‌‌‌సీ మోటార్‌‌‌‌‌‌‌‌సైకిళ్లతో పాటు వీఎల్ఎఫ్ మోబ్‌‌‌‌‌‌‌‌స్టర్ 135 పెట్రోల్ స్కూటర్, వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించారు.