జీడిమెట్ల, వెలుగు: బైక్‌లు దొంగలిస్తున్న ఓ వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడు గ్రామానికి చెందిన సయ్యద్ మహ్మద్ పాషా ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి దుండిగల్ తాండా–2లో నివాసముంటూ కూలీగా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలను ప్రారంభించాడు.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా సయ్యద్ మహ్మద్ పాషాను అరెస్ట్ చేసి, అతని ఇంటి వద్ద ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
