పాటల పల్లకిలో ‘ఐక్యూ’

పాటల పల్లకిలో ‘ఐక్యూ’

మధ్య తరగతికి చెందిన ఓ అమ్మాయి తన తెలివితేటలతో ప్రపంచస్థాయి గుర్తింపు ఎలా తెచ్చుకుంది ? అనే కథాంశంతో ‘ఐక్యూ’ సినిమా తెరకెక్కుతోంది. కాలేజ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాయగూరల సాయిశరణ్‌, పల్లవి, ట్రాన్సీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్‌ జీఎల్బీ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. డబ్బింగ్‌ కూడా పూర్తి కావడంతో రీ రికార్డింగ్‌ జరుపుతున్నారు.

ఈ చిత్రం పాటలను ఇదే వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.హైదరాబాద్‌, అనంతపూర్‌ లలో 'ఐక్యూ' సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా టీజర్‌ ఫస్ట్‌లుక్‌, పోస్టర్‌ ఇప్పటికే విడుదల చేశారు. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని శ్రీనివాస్‌ జీఎల్బీ వెల్లడించారు. యువతకు ప్రేరణ కలిగించే అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. సుమన్‌, సత్యప్రకాష్‌, సూర్య, గీతాసింగ్‌, బెనర్జీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం ఘటికాచలం, ఛాయాగ్రహణం టి.సురేంద్రరెడ్డి.