నడిరోడ్డుపై కారు దగ్ధం

నడిరోడ్డుపై కారు దగ్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గణేష్ టెంపుల్ దగ్గర మారుతి కారులో మంటలు వ్యాపించాయి.  లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీకి చెందిన మల్లికార్జునరావు అనే ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ కు చెందిన ఓల్డ్ మోడల్ మారుతి 800 కారు తగలబడిపోయింది. గణేష్ టెంపుల్ వద్దకు రాగానే కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారులో నుంచి కిందకు దిగాడు. ఈ సంఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడ అంతా పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఒక్కసారి కారులోంచి మంటలు రావడంతో అక్కడున్న వాళ్లు భయంతో పరుగులు పెట్టారు. ఎవ్వరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.