మల్లన్న టెర్రరిస్ట్ కాదు, పోరాట యోధుడు

మల్లన్న టెర్రరిస్ట్ కాదు, పోరాట యోధుడు

తీన్మార్ మల్లన్నను దేశ ద్రోహి లాగా జైలులో బంధించారని.. 37 రోజులుగా మానసికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అర్వింద్. ఇవాళ(సోమవారం) మల్లన్నను చంచల్ గూడ జైలులో కలిసిన అర్వింద్..మల్లన్న టెర్రరిస్ట్ కాదు, పోరాట యోధుడని అన్నారు. ఒక్కడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా అయ్యా, కొడుకులకు చుక్కలు చూపెట్టాడని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇంతకు ఇంత అనుభవిస్తారన్నారు. అసలైన దొంగలు మీరు.. మల్లన్న కాదన్నారు అర్వింద్.

తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మల్లన్నను బంధించారన్నారు. మల్లన్నను బీజేపీలో చేర్చుకోవాలని కేంద్ర నాయకత్వం చెప్పిందని..త్వరలోనే ఆయన బయటకు వస్తాడు, ఘన స్వాగతం పలుకుతామన్నారు ఎంపీ అర్వింద్.

కేసీఆర్ గాంధీ కాదు.. బ్రాంది అంటే జైలులో పెడతారా ? కేసీఆర్ గాంధీ నా, బ్రాంది నా?? అని అన్నారు. చిల్లర కేసుల పేరుతో మల్లన్నను వేదించాలనుకున్నారు కానీ.. పోరాట యోధుడు ఎవరికీ భయపడడన్నారు. అంతేకాదు..ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు అర్వింద్.