శ్రీశైల ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రికి సంజ‌య్ ఫిర్యాదు

శ్రీశైల ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రికి సంజ‌య్ ఫిర్యాదు

శ్రీశైలం పవర్‌హౌజ్‌ ప్రమాద ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌(ఆర్కే సింగ్‌)‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ . శుక్రవారం కేంద్ర మంత్రిని క‌లిసిన సంజ‌య్.. శ్రీశైల ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు.

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు లేవ‌ని, 1998, 2009 సంవ‌త్సరాల‌లో వరదలు వ‌చ్చినా, 2019 అగ్నిప్రమాదం జ‌రిగినా భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పెంచ‌లేద‌ని విన‌తిప‌త్రంలో పేర్కొన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అందులో పనిచేసే ఉద్యోగులను అలర్ట్ చేసేందుకు ఎలాంటి ఫైర్ అలారం లేదని, నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రమాణాల మేరకు అన్ని జలవిద్యుత్కేంద్రాల్లో ఫైర్ అలారం ఏర్పాటు చేయాలని అన్నారు.

ప్రమాదాలు ఎదురైనప్పుడు తప్పించుకునేందుకు ఎమర్జెన్సీ లైటింగ్ గాని, సరైన వెంటిలేషన్ గాని లేద‌ని మంత్రికి వివ‌రించారు. ప్రమాదం సంభవించినప్పుడు చీకట్లు కమ్ముకొని పూర్తిగా అంధకారం కావడంతో ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి తప్పించుకోలేకపోయారని, ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు.

ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఆర్కే సింగ్‌.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఈఏ) ద్వారా విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.