V6 News

ఎన్నికల్లో లబ్ధికే పార్లమెంట్ స్పెషల్ సెషన్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఎన్నికల్లో లబ్ధికే పార్లమెంట్ స్పెషల్ సెషన్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • మహిళా రిజర్వేషన్లకు ఇండియా కూటమి వ్యతిరేకం కాదు: ఎంపీ చామల 

హైదరాబాద్, వెలుగు: తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ స్పెషల్​సెషన్​ఏర్పాటు చేసిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లకు ఇండియా కూటమి వ్యతిరేకం కాదని, ఈ విషయాన్ని తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, 2024 తర్వాత ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 33 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అమలు చేసినా తమకు ఇబ్బంది లేదన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అడ్డుకుందని ఇండియా కూటమిపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. డీలిమిటేషన్ చేయడానికి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని, ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య అంతరం లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.