తొమ్మిదేండ్లలో ఇయ్యలేదు.. ఇంక సావైనంక ఇండ్లిస్తడా? : ఎంపీ అర్వింద్

తొమ్మిదేండ్లలో ఇయ్యలేదు.. ఇంక సావైనంక ఇండ్లిస్తడా? : ఎంపీ అర్వింద్

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత టార్గెట్ గా మరోసారి విమర్శలు చేశారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా.. కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం ఏమీ ఇవ్వడం లేదంటోందని ఆరోపించారు. మత్తు పదార్థాలు తీసుకుంటారని కేటీఆర్ పై ఉన్న ఆరోపణలు తమ నాయకుడు కిషన్ రెడ్డిపై లేవని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాదిరి బాలీవుడ్ నటులతో కిషన్ రెడ్డికి దోస్తానా లేదన్నారు. ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలు కిషన్ రెడ్డిపై లేవన్నారు. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు ఎంపీ ధర్మపురి అర్వింద్. బాట సింగారం డబుల్ బెడ్రూం ఇండ్లకు బాట ఉంది గానీ.. సింగారం మాత్రం లేదన్నారు. పేదల ఇండ్ల నిర్మాణాలపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణలో హౌసింగ్ శాఖే లేదు.. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పడు కడుతారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు.. ఇంకా సావైనంక ఇండ్లు ఇస్తారా..? అని ప్రశ్నించారు. మరోవైపు.. కిషన్ రెడ్డి అరెస్ట్ ను ఎంపీ అర్వింద్ ఖండించారు.