
- ఎంపీ డీకే అరుణ
మద్దూరు,వెలుగు: పల్లెల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం అల్లీపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎంపీ నిధులతో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీఎం నరేంద్ర మోదీ దేశంలో ఎన్నో స్కీంలు ప్రవేశ పెడుతున్నారన్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో రూ.2.5 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, లీడర్లు వెంకటయ్య, రఘు, ఆదేశ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.