యదార్థ గాథలకు ప్రతిబింబం ది కేరళ స్టోరీ -2.. సినిమా చూసిన ఎంపీ డా. కె. లక్ష్మణ్

 యదార్థ గాథలకు ప్రతిబింబం ది కేరళ స్టోరీ -2.. సినిమా చూసిన ఎంపీ డా. కె. లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఓడియన్ థియేటర్​లో ప్రదర్శిస్తున్న ‘ది కేరళ స్టోరీ -2’ చిత్రాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మంగళవారం వీక్షించారు. సినిమా అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలోని యదార్థ గాథలను ప్రతిబింబించే ఇలాంటి చిత్రాలు సమాజంలో గొప్ప చైతన్యాన్ని కలిగిస్తాయన్నారు.

ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు, మత మార్పిడిల పేరిట సాగుతున్న అన్యాయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.