పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం...హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం...హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     పర్యావరణం, అడవులు- వాతావరణ మార్పులపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు- వాతావరణ మార్పులపై శుక్రవారం ఢిల్లీలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఇతర కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు, స్థిరమైన అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతి వంటి అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా సభ్యులు పలు సూచనలు చేశారు.